Seethakka: కేటీఆర్ పెంపుడు కుక్కల కోసం రూ.12 లక్షలా? మంత్రి సీతక్క విస్మయం
Seethakka Vs KTR: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ.. ప్రజాక్షేత్రంలోనూ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌పై సీతక్క విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్ పెంచుకునే కుక్కల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు.
Pragati Bhavan: అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా సీతక్క ఆదివారం తన సొంత జిల్లా ములుగులో పర్యటించారు. ములుగు మండలం గుర్తూరు తండా గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సీతక్క బీఆర్ఎస్ పార్టీ తీరుపై, ముఖ్యంగా కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణను లూటీ అయ్యిందని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఏర్పడిందని మండిపడ్డారు.
కేసీఆర్ కటించిన ప్రగతి భవన్‌లో కేటీఆర్ పెంచుకునే కుక్కలకు రూ.12 లక్షలతో ఇండ్లు కట్టించడం ఏమిటని సీతక్క విస్మయం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేసి తెలంగాణ ఖజనాను ఖాళీ చేశారని విమర్శించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని ఆరోపించారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పట్టా భూములు, పంటలకు సాగునీరు అదేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను పక్క అమలుచేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పేదలను గుర్తించి రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసినట్లు గుర్తుచేశారు. ఇంకా 4 గ్యారంటీలు త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజా సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకుపోతామని తెలిపారు.
Also Read: Lavanya Tripathi: విశాఖ బీచ్‌లో చెత్తాచెదారం ఏరివేసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook